* ఉద్యోగుల పెండింగ్ సమస్యలు సత్వరమే పరిష్కారించాలి
ప్రజానావ బ్యూరో,పెద్దపల్లి: తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా 2026–29 తొలి కార్యవర్గ సమావేశం ఐఎంఏ హాల్, ఐడీఓసీ సమీపంలో జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొంకూరి శంకర్ మాట్లాడుతూ సంచలనాత్మక నిర్ణయాలతో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి చెల్లింపులు లేకుండానే కోటి రూపాయలు ఆ పైన ప్రమాద భీమా సౌకర్యం కల్పించడమే కాకుండా, ఉద్యోగులకు ఈ ఎచ్ ఎస్ స్కీం ని ప్రవేశ పెట్టి ఎన్నో ఉద్యోగ కుటుంబాలకు భరోసా ఇస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సీపిఎస్ రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీపిఎస్ ఉద్యోగులకు మేలు చేకూర్చాలని, ఆంక్షలులేని ఈ ఎచ్ ఎస్ విధానాన్ని రూపొందించి ఉద్యోగులకు సులువైన వైద్య సేవలు అందించాలని, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, డీఏ, పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ, మిగతా ఉద్యోగ సమస్యలను కూడా పరిష్కరించాలని తద్వారా ఉద్యోగ సంఘాల పక్షాన నిలిచి అక్కున చేర్చుకోవాలని టీఎన్జీఓ సంఘం, పెద్దపల్లి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల ప్రయోజనాలే సంఘానికి ప్రథమ ప్రాధాన్యత అని, ప్రతి సభ్యుడు సంఘ బలోపేతానికి భాగస్వామి కావాలని, సంఘ బలోపేతం, ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ల్లా వ్యాప్తంగా ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు హెల్త్ స్కీమ్‌పై అవగాహన కల్పిస్తూ, అవసరమైన సూచనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, సంఘ భవిష్యత్ కార్యాచరణపై కూడా సభ్యులు తమ విలువైన సూచనలు అందించగా, ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సేవా సమస్యల పరిష్కారమే సంఘ ప్రధాన లక్ష్యమని సమావేశం స్పష్టం చేసింది. జిల్లా ప్రధాన కార్యదర్శి అయిరెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సంఘాన్ని మరింత చైతన్యవంతంగా తీర్చిదిద్దుతూ ప్రతి ఉద్యోగి సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కార్యవర్గ సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి సంఘ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ అనిత రెడ్డి, కోశాధికారి కొమురయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, స్వప్న కుమారి, సంయుక్త కార్యదర్షులు ప్రవీణ్, శ్రీధర్, రమేష్, సౌమ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి, పబ్లిసిటీ సెక్రటరీ నిశాంత్ రావు, కార్యవర్గ సభ్యులు శిల్పారెడ్డి , స్వప్న, శివధర్మతేజ, ముస్తఫా, నామినేటెడ్ సభ్యులు రాజారత్నం, సంపత్, శ్రీనివాస్, పెద్దపల్లి అర్బన్ యూనిట్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, పెద్దపల్లి రూరల్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు అమరేందర్ రెడ్డి, ప్రేమ్ సాగర్, రామగుండం యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు జగన్, సరిత, సుల్తానాబాద్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు భాగ్యమ్మ, రాజిరెడ్డి, మంథని యూనిట్ అధ్యక్షుడు శంకర్ లు పాల్గొన్నారు.

