మంచిర్యాల జిల్లా,ప్రజానావ న్యూస్:మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్.ఐ. ఉషారాణి ఆదేశాల మేరకు, విద్యార్థుల భద్రతను పెంపొందించే లక్ష్యంతో శనివారం చెన్నూరులోని ‘మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు)’ లో జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మాట్లాడుతూ… సమాజంలో షీ టీమ్స్ పనిచేస్తున్న తీరు, వాటి ముఖ్య ఉద్దేశాలను విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. సమాజానికి పెద్ద సవాలుగా మారిన సైబర్ నేరాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం ఏదైనా ఆపద లేదా సమస్య ఎదురైనప్పుడు వెంటనే డయల్ 100 కి గానీ, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్: 6303923700, లేదా మంచిర్యాల షీ టీమ్ నంబర్: 8712659385 ను సంప్రదించాలని, ఈ నంబర్లను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

