Monday, July 27, 2026

Buy now

సింగరేణి అభివృద్ధి, 12వ JBCCI వేజ్ బోర్డు ఏర్పాటుపై INTUC కోర్ కమిటీ కీలక చర్చ

హైదరాబాద్: సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితులు, సంస్థ భవిష్యత్ అభివృద్ధి, నూతన బొగ్గు గనుల సాధన, 12వ జేబీసీసీఐ (JBCCI) వేజ్ బోర్డు ఏర్పాటు, కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత తదితర కీలక అంశాలపై INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ అధ్యక్షతన సోమవారం ఆయన నివాసంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది.

సమావేశంలో సింగరేణి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మరిన్ని బొగ్గు బ్లాకులను సాధించేందుకు సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. అలాగే కార్మికుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 12వ JBCCI వేజ్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేసి, వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించారు.

అదేవిధంగా కార్మికులకు సంబంధించిన పెండింగ్ హామీల అమలు, పర్క్స్‌పై ఆదాయపు పన్ను మినహాయింపు, సొంతింటి పథకం అమలు, మారుపేర్లు (Alias Names), విజిలెన్స్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారం, నూతన బొగ్గు గనుల కేటాయింపు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

సింగరేణి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, సంస్థ విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, కార్మిక సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం, గనుల్లో భద్రతా ప్రమాణాల మెరుగుదలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

అలాగే యూనియన్ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, హైదరాబాద్‌లో జరగనున్న మహాసభలకు కార్యాచరణ రూపొందించడం, అన్ని ఏరియాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించడం, కార్మికుల సమస్యలను ప్రజాప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం, అవసరమైతే ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఈ సమావేశంలో డా. బి. జనక్ ప్రసాద్‌తో పాటు నరసింహ రెడ్డి, ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, త్యాగరాజన్, జెట్టి శంకర్ రావు, వికాస్ కుమార్ యాదవ్, రామిశెట్టి నరేందర్, రఘుపతి రెడ్డి, జోగ బూచయ్య, వడ్డేపల్లి దాస్, లక్ష్మిపతి గౌడ్, పశునుటి రాజేందర్, ఎం.డి. అక్రమ్, ఏనుగు రవీందర్ రెడ్డి, జీవన్ జోయల్, కలవెన శ్యామ్, శేషారత్నం, ఆరేపల్లి శ్రీనివాస్, అల్బర్ట్, కె. సదానందం, సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, దేవి భూమయ్య, పేరం శ్రీనివాస్, రజాక్, పేతాంబర్ రావు, జే. వెంకటేశ్వర్లు, కృష్ణంరాజు, కోటేశ్వర్ రావు, క్రాంతి కుమార్, పేరం రమేష్, గరిగే స్వామి, తిరుపతి రాజు, రాపర్తి శ్రీనివాస్, లలిత తదితరులు పాల్గొని పలు కీలక అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Related Articles

spot_img

Most Popular