Monday, July 27, 2026

Buy now

తప్పు చేసి రాజీనామా చేసిన మంత్రికి పార్లమెంట్‌లో ఘన స్వాగతమా!

* విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడి.. ఇప్పుడు సంబరాలా?**
* బీజేపీ యువతకు ఏ సందేశం ఇస్తోందని కవిత ప్రశ్న**

హైదరాబాద్:కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం పార్లమెంట్‌కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఎంపీలు ఘన స్వాగతం పలకడం, “జిందాబాద్” నినాదాలు చేయడంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆమె, “తప్పు చేసి రాజీనామా చేసిన వ్యక్తిని హీరోలా స్వాగతించడం ద్వారా బీజేపీ సమాజానికి, ముఖ్యంగా యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది?” అని ప్రశ్నించారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి, అపనమ్మకంతో ఉన్న యువతను ఇలాంటి ఘటనలు మరింత ఆగ్రహానికి గురిచేస్తాయని కవిత పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పశ్చాత్తాపంతో గానీ, జవాబుదారీతనంతో గానీ చేసినది కాదని, ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు బీజేపీ ఆడిన రాజకీయ నాటకమేనని విమర్శించారు.

పార్టీ పట్ల విధేయత ఉంటే ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేసినా పట్టించుకోరనే సందేశమే ఈ ఘటన ద్వారా వెలుగులోకి వచ్చిందని ఆమె ఆరోపించారు. విద్యార్థుల జీవితాలను దెబ్బతీసిన వైఫల్యాలను సైతం ఘనకార్యాలుగా చూపిస్తూ ఊరేగింపులు చేయడం బాధాకరమని, దేశ రాజకీయాలు ఎటు దిశగా సాగుతున్నాయో ఆందోళన కలుగుతోందని కవిత వ్యాఖ్యానించారు.
photo File

Related Articles

spot_img

Most Popular