Thursday, July 30, 2026

Buy now

ప్రజలు అంటు వ్యాధులకు గురికాకుండా ఉండాలి

* పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై పవిత్ర

ప్రజానావ,బ్యూరో,పెద్దపల్లి : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వై పవిత్ర గత కొన్ని రోజుల నుండి వర్షాలు నిరంతరం కురవడం వలన ప్రజలకు అంటు వ్యాధులు సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వార ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన చేసుకొని అంటు వ్యాధులకు గురికాకుండా ఉండాలని కోరారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుకోవాలని ఈగలు దోమల నివారించాలని తెలియజేశారు.

ఈగల వలన కలరా టైఫాయిడ్ రక్త విరోచనాలు నీళ్ల విరోచనాలు టైఫాయిడ్ సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. దోమల వలన మలేరియా ఫైలేరియా డెంగ్యూ చికెన్ గునియా మెదడువాపు వ్యాధులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారా రక్త పరీక్షలు చేయించుకొని తగిన చికిత్సలు తీసుకోవాలని కోరారు. ప్రజలు వేడి చేసి చల్లార్చిన నీటిని వేడి ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలని కోరారు. వర్షాల వలన పిల్లలు వృద్దులు ఎవరు కూడా అనవసరంగా ప్రయాణాలు చేయకుండా ఉండాలని తెలిపారు.

గర్భిణీ స్త్రీలు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సహాయంతో ముందుగానే ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లి ప్రభుత్వ వైద్యుల ద్వారా సాధారణ ప్రసవాలు జరిగేటట్లు చూసుకోవాలని కోరారు. వైద్య ఆరోగ్యశాఖ అందించే సేవలపై అవగాహన పెంచుకొని ఆరోగ్యవంతంగా జీవించాలని తెలిపారు.

ఈ వర్షాలు మరికొన్ని రోజులు వచ్చే అవకాశం ఉన్నందువలన ప్రయాణాలకు అంతరాయం కలిగి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆశా కార్యకర్త నుండి వైద్యాధికారి వరకు అందరు అప్రమత్తంగా ఉండి సమన్వయముతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.

ఎవరికి కూడా ఎలాంటి సాధారణ సెలవులు మంజూరు చేయడం లేదని తెలిపారు. ప్రతి ఉద్యోగి వారి వారి కేటాయించిన హెడ్ క్వార్టర్ లో ఉండి సేవలందించాలని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపైన సిసిఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Related Articles

spot_img

Most Popular