Thursday, July 30, 2026

Buy now

సిసీ కెమెరాల ఆధారంగా నిందితుడి పట్టివేత

* అభినందించిన పెద్దపల్లి సీఐ కే.ప్రవీణ్ కుమార్

ప్రజానావ,బ్యూరో,పెద్దపల్లి : జిల్లా కేంద్రం లోని భరత్ నగర్ కు చెందిన మామిడిపల్లి ప్రదీప్ అనునతను 2026 జూన్ 20న తన పని నిమిత్తం మంథనికి వెళ్తూ ఉదయం 8 గంటలకు పెద్దపల్లి బస్ స్టాండ్ వద్ద గల పెద్దపల్లి ఫార్మసీ ముందు తన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ టిఎస్ 22 డి 7969 ను పార్క్ చేసి తిరిగి రాత్రి 7.30 గంటలకు వచ్చి చూడగా అతని బైక్ కనబడలేదని తన బైక్ గురించి వెతికిన ఎలాంటి సమాచారం దొరకక పోయేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన బైక్ ను దొంగిలించుకొని వెళ్ళినట్లు ధరకాస్తూ ఇవ్వగా ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. సిసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని 2026 జూలై 29న సాయంత్రం నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరేష్ తన సిబ్బంది యుక్తంగా చీకురాయి చౌరస్తా వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ నిందితుడైన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లి చెందిన రంగు గంగాధర్ అనునతడిని గొంగలించిన బైక్ యుక్తంగా పట్టుకోవడం జరిగిoది. విచారణలో నిందితుడిపై సుమారు 9 కేసులు ఉన్నట్లు తెలిసిoది. నిందితుడిని రిమాండ్ నిమిత్తం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచారు. కేసును చెందించిన పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె.నరేష్, పోలీసులు ప్రభాకర్, సతీష్ లను పెద్దపల్లి సీఐ కే.ప్రవీణ్ కుమార్ అభినందించారు.

Related Articles

spot_img

Most Popular