Thursday, July 30, 2026

Buy now

వేములవాడ బస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

* బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సు సేవల ప్రారంభం*

వేములవాడ: వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక అడుగుగా వేములవాడ బస్ స్టేషన్ ఆధునీకరణ పనులకు గురువారం శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఈ అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులతో పాటు స్థానిక ప్రజలకు ఆధునిక రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని నాయకులు తెలిపారు. బస్ స్టేషన్ ఆధునీకరణతో ప్రయాణికులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

అనంతరం ప్రయాణికుల సౌకర్యార్థం వేములవాడ–కోరుట్ల మీదుగా పుణ్యక్షేత్రమైన బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సు సేవలను మంత్రులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కొత్త సర్వీసు వల్ల భక్తులు, ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, డాక్టర్ సంజయ్ కుమార్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా ఎస్పీ, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular