Saturday, August 15, 2026

Buy now

లక్ష్యంతో చదివితే విజయం వరిస్తుంది

* ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఓరియంటేషన్ డే
* క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది
* మాజీ ఎమ్మెల్యే, ట్రినిటీ విద్యా సంస్థల వ్యవస్థాపన అధ్యక్షులు దాసరి మనోహర్ రెడ్డి

పెద్దపల్లి : ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ కొండగట్టు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగ అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సతీష్, దాసరి మనోహర్ రెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు, మోటివేషనల్ స్పీకర్ శ్రీనివాస్ హాజరై విద్యార్థులను వారి భవిష్యత్తు గురించి వివరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఇంజనీరింగ్ వైపు అడిగేయడం శుభ సూచికమని ట్రినిటీ ఇంజనీరింగ్ అటానమస్ కళాశాలను ఎంచుకోవడం ఒక తెలివైన నిర్ణయమని కళాశాల ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించడం కొరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గత 40 సంవత్సరాలుగా మారుమూల ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులకు సేవలందిస్తూ ఎందరో మంది విద్యార్థుల జీవితాలను స్థిర పడే విధంగా చేస్తుందని ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం జాయిన్ అయిన విద్యార్థులు మొదటి రోజు నుండే ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను నేర్చుకుంటూ క్రమశిక్షణతో చదివి ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా ముందుకు వెళ్లాలని ఇప్పుడున్న తరుణంలో ఉద్యోగ అవకాశాలు పొందడం అనేది బ్రాంచీలతో సంబంధం లేకుండా పొందవచ్చని తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క చదువు పట్ల ఎప్పటికప్పుడు గమనిస్తూ విద్యార్థులను సక్రమమైన మార్గంలో ఉంచేట్టు తల్లిదండ్రులు కృషి చేయాలని తమ యొక్క కళాశాల లో 18 సంవత్సరాల పైగా అనుభవం కలిగిన అధ్యాపకులచే విద్యార్థులకు బోధన అందిస్తూ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా కార్యక్రమాల రూపొందిస్తూ ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించే విధంగా సెమినార్స్, ఇండస్ట్రియల్ విజిట్స్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇలాంటివి విద్యార్థులు అందిస్తామని అన్నారు తమ యొక్క కళాశాల పై నమ్మకం ఉంచి ఈ యొక్క కళాశాలలో సీట్ పొందున విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేషన్ మాట్లాడుతూ తమ యొక్క కళాశాల ఫౌండర్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో వారి మార్గదర్శకంలో ప్రతిష్టాత్మకమైన నాక్ అక్రిడేషన్, అటానమస్ పొందడం జరిగిందని మరియు రానున్న కాలంలో యూనివర్సిటీ దిశగా ముందుకు వెళ్తున్నామని అంతేకాకుండా జిల్లాలో అటానమస్ కలిగిన ఏకైక కళాశాల రానున్న కారణంగా విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించే విధంగా కార్యక్రమాల రూపొందించి విద్యార్థులకు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ సతీష్, శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేషన్, ఏవో సురేష్, రాజిరెడ్డి, చొప్పరి వంశీ, విభాగాధిపతులు పద్మిని, స్వాతి, లక్ష్మి, ప్రభాకర్, డాక్టర్ ఆరిఫ్ మరియు సీనియర్ ఆధ్యాపకులు వెంకటస్వామి, మహేందర్, రామ్మూర్తి, కొప్పుల శ్రీనివాస్, కిషన్, రవీందర్, రాజు, విజయ, చంద్రశేఖర్ భవిత, పుష్పలత విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular