ప్రజానావ,పెద్దపల్లి :ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెద్దపల్లిలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను దోస్త్ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా ఇంకా ఖాళీగా మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు స్పెషల్ ఫేజ్ ప్రక్రియను ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ కే. లక్ష్మీ నరసయ్య తెలిపారు. ఖాళీగా ఉన్నా సీట్ల వివరాలు ప్రకటిస్తూ బీకాం (బిఎఫ్ఎస్ఐ), బి జెడ్ సి (లైఫ్ సైన్సెస్), బీఎస్సీ( ఎంపీసీఎస్), బి.ఏ కోర్సులలో ఖాళీలు ఉన్నట్లుగా తెలిపారు. స్పెషల్ ఫేజ్ అడ్మిషన్స్ ప్రక్రియ ఆగస్టు 6 నుండి 11 వరకు కొనసాగుతుందని, ఇంటర్మీడియట్ విద్య ఉత్తీర్ణత అయి డిగ్రీ ప్రవేశాల కోసం ఆసక్తి కనబరుస్తున్న విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం అని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పెద్దపెల్లిలో ప్రవేశం పొందాలని సూచించారు. ప్రవేశాల కోసం విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా లేదా దోస్త్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు.

