ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టిజెఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఎం.ఎ. ఖాదర్ పాషా పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ చౌరస్తా వద్ద ఉన్న జయశంకర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలిదశ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడు జయశంకర్ అని, స్వరాష్ట్రంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం టిజెఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ హాకీమ్ యాదగిరి, కో-కన్వీనర్ రమేష్, నాయకులు వేణుగోపాల్, జోసెఫ్, రామస్వామి, వంశీ, నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

