ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ప్రజలను చైతన్యవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కామ్రేడ్ బాల నరసింహం పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రమైన బిజినపల్లిలో సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు నిర్వహించిన ప్రచార పాదయాత్రలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. హామీలను విస్మరించి, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతున్న సీపీఐ, బిజెపి విచ్ఛిన్నకర రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కె.కేశవులు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల చంద్రమౌళి, మండల కార్యదర్శి కృష్ణాజి, కౌన్సిల్ సభ్యులు తన్నీరు మల్లయ్య, మారేడు శివశంకర్, మధు గౌడ్, ప్రేమ్ కుమార్, నాయకులు భూపేష్, నరసింహ, పర్వతాలు, శివకృష్ణ, రామస్వామి, శీను, రవి తదితరులు పాల్గొన్నారు.

