Friday, August 14, 2026

Buy now

3 గంటల్లో చిన్నారి అపహరణ కేసు ఛేదించిన మేడిపల్లి పోలీసులు

* శిశువు క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత
మేడిపల్లి: ఎనిమిది నెలల శిశువు అపహరణ కేసును మేడిపల్లి పోలీసులు కేవలం మూడు గంటల్లోనే ఛేదించి చిన్నారిని క్షేమంగా రక్షించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందిన వెంటనే మల్కాజిగిరి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేగంగా దర్యాప్తు చేపట్టారు.

సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయిలో గాలింపు చర్యల ఆధారంగా నిందితురాలిని కర్మన్‌ఘాట్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శిశువును సురక్షితంగా రక్షించి, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించారు.

వేగవంతమైన స్పందన, సమన్వయంతో కూడిన దర్యాప్తు, సాంకేతిక నైపుణ్యంతో కేసును అత్యంత తక్కువ సమయంలో ఛేదించిన పోలీసులను అధికారులు అభినందించారు.ప్రజల భద్రతే తమ ప్రధాన బాధ్యత అని మల్కాజిగిరి పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular