ఘట్కేసర్: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో “మీ సురక్ష–సహచరి” సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, రోడ్డు భద్రత, నేరాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన, కమ్యూనిటీ పోలీసింగ్ అంశాలపై సభ్యులకు పోలీసులు అవగాహన కల్పించారు.
అలాగే పోలీసులకు సకాలంలో సమాచారం అందించడం ఎంత ముఖ్యమో వివరించారు. పోలీస్–ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలను వెంటనే పోలీసులకు తెలియజేస్తూ కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా సమాజ భద్రతలో భాగస్వాములు కావాలని “సహచరి” సభ్యులకు పోలీసులు పిలుపునిచ్చారు.

