Friday, August 14, 2026

Buy now

మహిళల భద్రతకు భరోసాగా ‘మీ సురక్ష–సహచరి’ కార్యక్రమం

బోయిన్‌పల్లి: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలో నిర్వహించిన ‘మీ సురక్ష–సహచరి’ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పాల్గొని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మహిళల భద్రత, స్టాకింగ్, సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ ఆర్థిక మోసాలు, ర్యాగింగ్, మాదకద్రవ్యాల దుర్వినియోగం, సంబంధిత చట్టాలు, అలాగే ఇటువంటి నేరాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ కమిషనర్ వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112కు కాల్ చేయాలని సూచించిన ఆమె, సైబర్ నేరాలు లేదా ఇతర ఫిర్యాదుల కోసం మల్కాజిగిరి పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్ 8712662111ను వినియోగించాలని మహిళలకు సూచించారు.
పోలీస్–ప్రజల భాగస్వామ్యంతో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, సైబర్ నేరాలపై అప్రమత్తత పెంచడం, సమాజంలో భద్రతా చైతన్యం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular