ప్రజానావ న్యూస్/ మంచిర్యాల జిల్లా :చెన్నూర్ పట్టణ కేంద్రంలోని రజకుల సమస్యల పైన ఈరోజు ఇంటింటి, సర్వే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. రజక వృత్తిదారుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వనికి తెలియజేయడం కోరకు రజక వృత్తిదారులకు దోబీ ఘాట్ స్థలం కేటాయించి పట్టణ కేంద్రానికి, మోడ్రన్ దోబీ ఘాట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇప్పటివరకు ఎలాంటి రుణాలు రాలేదని తెలిపారు. పాత సొసైటీలను పునరుద్ధరణ చేసి రజకులకు రజక ఫెడరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ సర్వే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని. ఆగస్టు 15 తేదీలోపు పూర్తి, సర్వే చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మల మధుకర్ పాల్గొని ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, తదితరులు పాలుగోన్నారు.

