– నిరుద్యోగ యువతకు ఆర్నమెంటల్ ఫిష్ సీడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రోత్సహించాలి
– ఆగస్టు 10న జైలు బరో కు మత్స్యకారుల సంఘం మద్దతు
ప్రజానావ న్యూస్ / మంచిర్యాల జిల్లా :తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో హాజీపూర్ మండలంలోని ముల్కల, రాపెల్లి, నంన్నూర్ గుడిపేట, మత్స్యకారుల స్థితిగతులపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బోడెంకి చందు మత్స్యకారుల సంఘం జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడుతూ.. ప్రతి మత్స్య సొసైటీకీ ఉచిత చేప పిల్లలకు బదులు నగదు బదిలీ చేయాలని, మత్స్యకార నిరుద్యోగులకు ఫిష్ ఫుడ్ కోర్టులు, ఆర్నమెంటల్ ఫిష్ సీడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి యువతకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలని, ప్రతి మండల కేంద్రంలో చాపల మార్కెట్ నిర్మించాలని ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు టూ వీలర్స్,ఫోర్ వీలర్స్ వాహనాలు అందించాలని, మరియు పెండింగ్లో ఉన్న ఎక్స్ గ్రేషియో, ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 10న జైల్ బరో కార్యక్రమానికి మత్స్యకార సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచర్ల రాజేందర్ జిల్లా అధ్యక్షులు, భోగిరి రాజ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు పలు గ్రామాల మత్స్యకారులు పాల్గొన్నారు.

