* బొగ్గు పరిశ్రమల్లో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయొద్దని డిమాండ్.
* ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా
* యాజమాన్యం కు వినతి పత్రం ఇచ్చిన జాతీయ కార్మిక సంఘాల నాయకులు.
రామగుండం: దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బొగ్గు గని కార్మికులకు జీతాల పెంపు కోసం 12 వ వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని,నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమ ల్లో అమలు చేయరాదని డిమాండ్ చేస్తూ సింగరేణి ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి యాజమాన్యం కు వినతి పత్రం ఇచ్చారు.ఈ ధర్నా కార్యక్రమం లో జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఏఐటియుసి నుంచి కొరిమి రాజ్ కుమార్, ఐఎన్టీయుసి నుంచి ధర్మపురి, సిఐటియు నుంచి ఎస్. వీరయ్య,హెచ్ ఎం ఎస్ నుంచి దబ్బెట సతీష్ లు పాల్గొని ప్రసంగించారు.దేశంలో ఉన్న బొగ్గు గని కార్మికులకు జూన్ 30 తో 11 వ వేజ్ బోర్డు కాల పరిమితి ముగిసిందని,2026 జూలై1నుంచి 12 వ వేజ్ బోర్డు ప్రారంభం అయిందని,కానీ కోల్ ఇండియా యాజమాన్యం ఇంత వరకు వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంబించలేదని వారు ఆరోపించారు.గత కొన్ని నెలల క్రితం కోల్ ఇండియా యాజమాన్యంతో బొగ్గు గని కార్మిక సంఘాలతో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ ల అమలు గురించి ప్రస్తావించారని,51 శాతం ఓట్లు వచ్చిన కార్మిక సంఘంతోవేతన సవరణ జరుపుతామని తెలుప గా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు వ్యతిరేకించారని వారు పేర్కొన్నారు.గతంలో వలే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియ ను ప్రారంభించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా కోల్ ఇండియా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని తెలిపారని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను బొగ్గు పరిశ్రమల్లో అమలు చేయరాదని,వెంటనే 12 వ వేజ్ బోర్డు ప్రక్రియను ప్రారంభించేందుకు తక్షణమే కోల్ ఇండియా యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.లేనిచో కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేస్తామని అవసర మైతే నిరవధిక సమ్మె కు పిలుపు నిస్తామని వారు హెచ్చరించారు.అనంతరం జాతీయ కార్మిక సంఘాల నాయకులు ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు.ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను అద్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు మడ్డి ఎల్లా గౌడ్,తుమ్మల రాజిరెడ్డి,కె.సదానందం తో పాటు జాతీయ కార్మిక సంఘాలనాయకులు,కార్యకర్తలు,కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

