రామగుండం: ఆర్ జి 2 ఏరియా 8వ కాలనీ ఏఐటీయూసీ యూనియన్ కార్యాలయంలో సోమవారం భారత కమ్యూనిస్టు పార్టీ పాదయాత్ర వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.దేశంలో కేంద్రం లో బిజెపి ప్రభుత్వం మూడవ సారి గెలిచిన తర్వాత అడ్డు అదుపు లేకుండా ధరల పెరుగుదల,లేబర్ కోడులను ప్రవేశపెట్టడం జరుగుతోంది ఇది సరైన విధానం కాదని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ణయం తీసుకొని ప్రజా పోరాటాల గురించి వివరిస్తూ పాదయాత్రలు చేపడుతుందని. అందులో భాగంగా పెద్దపెల్లి జిల్లాలో కూడా ఈ పాదయాత్ర లు చేయడం జరుగుతుందని మండల కార్యదర్శి కందుకూరి రాజారత్నం తెలిపారు.పెద్దపల్లి జిల్లా లోని కమాన్ పూర్ మండల కేంద్రంలో నేడు మంగళవారం సాయంకాలం నాలుగు గంటలకు సిపిఐ ప్రజాయాత్ర జాత రావడం జరుగుతుందని జాతను ప్రజలు ఆదరించి జయప్రదం చేయాలని మండల కార్యదర్శి కందుకూరి రాజరత్నం పిలుపునిచ్చారు.ఈ జాతలో ప్రజలందరూ పాల్గొని ఎనిమిదో కాలనీలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆవుల రవికుమార్,నల్ల మదన్న,ఎంమహేందర్,తాళ్ల పల్లి నారాయణ,జాడి ఆంజనేయులు,సాగే కృష్ణ, అక్రం,సాంబన్న,అనిల్, రాయలింగు,గట్టయ్య,పోషం, నీలం మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

