Friday, August 14, 2026

Buy now

దశలవారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం :మేయర్ మహంకాళి స్వామి

రామగుండం: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని 35వ డివిజన్ సప్తగిరి కాలనీ,రాజ్య లక్ష్మీ కాలనీలలో దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు.సోమవారం 35 వ డివిజన్ రాజ్య లక్ష్మీ కాలనీలో రూ.7.00 కోట్ల స్పెషల్ ఫండ్ ప్యాకేజీ పనుల్లో భాగంగా రూ 8.00 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన సి సి రోడ్డు నిర్మాణపనులను స్థానిక కార్పొరేటర్ జంగపల్లి రమాదేవి శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తాను గెలిచిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రాజ్యలక్ష్మి కాలనీ,సప్తగిరి కాలనీ వర్షా కాలంలోముంపుకు గురి కాకుండా వరద నీటి కాలువ నిర్మించడం జరిగిందని అన్నారు.కొత్తగా ఏర్పడిన కాలనీ కావడంతో సరైన డ్రైనేజి వ్యవస్థ లేక మురుగునీరు రోడ్ల పై పారేదని అన్నారు.ప్రస్తుతం డ్రైనేజి నిర్మాణoపూర్తయిందని ఎం ఎల్ ఏ ఆదేశాల మేరకు రూ 50.00 లక్షల అంచనా వ్యయంతో రాజ్యాలక్ష్మీ కాలనీ లో రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని అన్నారు.ఇటీవల తాను డివిజన్ లో వార్డు సందర్శన కార్యక్రమం చేపట్టి సమస్యలు గుర్తించామని ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సాంబమూర్తి,డేవిడ్ రాజు,స్థానిక నాయకులు గడ్డం శ్రీనివాస్,పీచర శ్రీనివాస రావు,తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular