* ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి: కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్: తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివాసీ, బంజారా యోధులు కొమరం భీమ్, ఏకలవ్యుడు, టాను నాయక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆదివాసీల గొప్ప చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. తరతరాలుగా వస్తున్న ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిలుపునిచ్చారు.ఆదివాసీ యోధుల త్యాగాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కవిత అన్నారు.

