Friday, August 14, 2026

Buy now

రేవల్లి సర్పంచుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రజానావ ​ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: రేవల్లి మండలంలోని టప్ప రాజయ్య నివాసంలో సర్పంచుల సమావేశం నిర్వహించారు. రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి సుల్తాన్ అలీ, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వాడల పర్వతాలు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేవల్లి మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ​మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బాదేపల్లి రేవతి సురేష్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా టప్ప రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా సభావత్ శ్రీను, కోశాధికారిగా జి. పావని ఎన్నికయ్యారు. అలాగే కార్యదర్శులుగా లోడే అంజలమ్మ శ్రీశైలం, పాంపురం రేణుక బాల్ నాగయ్య, బి. రాజులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులతో పాటు నాయకుడు మిద్దె స్వామి పాల్గొన్నారు. ఈ వివరాలు టిపిసిసి రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కూర చందు వెల్లడించారు.

Related Articles

spot_img

Most Popular