* పోలీస్ శాఖ గౌరవాన్ని మరింత పెంచేలా పనిచేయాలి: పోలీస్ కమిషనర్
ఖమ్మం: ఖమ్మం పోలీస్ అసోసియేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి నూతన కార్యవర్గంగా ఎన్నికైన పోలీసు అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. మంగళవారం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ గౌరవాన్ని మరింత పెంచేలా నూతన కార్యవర్గ సభ్యులు వ్యవహరించాలని సూచించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తూ, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు.
* నూతన కార్యవర్గం:
* అధ్యక్షుడు: బి. హేమనాథ్
* ఉపాధ్యక్షులు: కె. జగదీష్, వి. సురేష్
* కార్యదర్శి: బి. వీరభద్రం
* సంయుక్త కార్యదర్శి: కె. సుధాకర్
* నిర్వహణ కార్యదర్శి: బి. అప్పారావు
* కోశాధికారి:టి. నరసింహరావు
* ఈసీ సభ్యులు
వై. వెంకటేశ్వర్లు, వి. హరికృష్ణ, కె. సురేష్, టి. జమలయ్య, ఎన్. ఎడుకొండలు, టి. రేణుక ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ సాంబరాజు, ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్ పాల్గొన్నారు.

