ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : తమ తలపునూరు గ్రామాన్ని నాగర్‌కర్నూల్ జిల్లాలో కలుపుతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే మేఘారెడ్డి విస్మరించడం శోచనీయమని అల్తాఫ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పత్రిక ముఖంగా తెలుపుతూ గత మూడేళ్లుగా గ్రామాన్ని నాగర్‌కర్నూల్ జిల్లాలో చేర్చాలని కోరుతూ గ్రామస్తులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు 59 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం మండలంలోని తలపునూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే, ప్రోటోకాల్ సైతం పక్కనబెట్టి నాగర్‌కర్నూల్ జిల్లా మీదుగా గ్రామానికి చేరుకున్నారని. భవనాన్ని ప్రారంభించి, ఇచ్చిన హామీ ఏమైపోతుందో అనే భయంతోనే కనీసం దీక్షా శిబిరాన్ని సందర్శించకుండా, గ్రామ సమస్యలను అడిగి తెలుసుకోకుండానే రిబ్బన్ కటింగ్ చేసి అటు నుంచి అటే వెళ్లిపోయారని అల్తాఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ నిలబెట్టుకోలేని నిస్సహాయ స్థితిలోనే ఎమ్మెల్యే ముఖం చాటేశారని, ఈ వైఖరి తీవ్ర విచారకరమన్నారు.

