ప్రజానావ / మంచిర్యాల :తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో గురువారం రోజున చెన్నూర్, మండల్లాలోని ఎంఈఓ కార్యాలయల ఎదుట నిరసన చేపట్టి అనంతరం కార్యాలయం సిబ్బందికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఎండీ కరీం కొమురంభీమ్ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్మికులతో నాణ్యమైన భోజనం నిర్వహణ జరుగుతుంది. గత 15, 20 సంవత్సరాలుగా కార్మికులు పని చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రతినెలా 10,000/- రూపాయలు వేతనం చెల్లిస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలోని కార్మికులు అధికారంలోకి తెచ్చారు. కానీ నేడు ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వమే మధ్యాహ్న భోజన నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలని నిర్ణయం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండి పెడుతున్న కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు. కొన్నివేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి మధ్యాహ్న భోజన నిర్వహణను యధావిధిగా కార్మికులతోనే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గట్టక్క దుర్గక్క, భుజ మల్లక్క, విజయ, తార, కిష్టక్క, భారతక్క తదితరులు పాల్గొన్నారు.

