– ఆదివాసీల చట్టాలను హరిస్తున్న కేంద్ర బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు.
– దసలీ రైతులు పై అటవీ శాఖ అధికారుల థౌర్జన్యాలు అరికట్టాలి.
– తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(టాగ్స్) రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్*
ప్రజానావ / మంచిర్యాల :తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ముగింపు వేడుకలు జరిగాయి. ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు మరియు భారీ ర్యాలీల ద్వారా వారి ఐక్యతను సమాజానికి చాటిచెప్పారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ హాజరై మాట్లాడుతూ..
ప్రపంచవ్యాప్తంగా ఆదివాసుల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి కోసం 1994లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. దేశంలో (జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ మణిపూర్,) వారి నివసిస్తున్న మైనింగ్, కనిజ వనరుల ను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్తూ ఆదివాసులపై తీవ్రమైన దాడులను ఎదుర్కొంటున్నారని, వారిని అడవుల నుంచి తరిమేస్తూ భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు అడవులను ప్రైవేటీకరిస్తూ, ఆదివాసులను అడవులకు దూరం చేసేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సాగు చేసుకుంటున్న పొడు భూములకు పట్టాలు ఇవ్వకుండా, ఫారెస్ట్ అధికారులను పంపి దాడులు చేయించడం దారుణమని పేర్కొన్నారు.సాగులో ఉన్న ప్రతి పొడు భూమికి తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల దాడులను పూర్తిగా నిలిపివేయాలని కోరారు. 100% ఆదివాసులు నివసించే నాన్-ఏజెన్సీ గ్రామాలను షెడ్యూల్డ్ జాబితాలోకి మార్చాలని తెలిపారు.
ఆదివాసి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రత్యేక చట్టాలు తెవాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఐక్యతతో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి భాగాల రాజన్న, ఎర్మ పున్నం మాట్లాడుతూ.. ఈ ప్రాంతం లో అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న దసలీ రైతుల కు జీవనోపాధి కల్పించడానికి పరిశ్రమ ఏర్పాటు చేశారు కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మూలంగా పరిశ్రమ మూతబడి ఎలాంటి జీవనోపాధి లేనటువంటి ఆదివాసీల పై అటవీ అధికారుల దాడి నీ ఖండిస్తున్నామన్నారు. స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఆదివాసి గ్రామాలకు సరైన రోడ్డు లేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారని. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర సహకార కార్యదర్శి పొలం రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశ్వరి, వృత్తిదారుల రాష్ట్ర నాయకులు ఆశయ, వ్యవసాయ కార్మిక సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పోలం రాజేందర్, ఐద్వా జిల్లా కార్యదర్శి ఉమారాణి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మోహన్, కిసాన్ మిత్ర జిల్లా కోఆర్డినేటర్ సిడం రమేష్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు తలండి ముత్తయ్య, సిడం సమ్మక్క, సుమలత, ఆలం మదనయ్య, వెంకన్న, సంపత్, మల్లేష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

