* లింగాపూర్ గ్రామంలో మానవతా సేవకు మరోసారి చేయూత
లింగాపూర్ : గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలతో పాటు, భారీ వర్షాల కారణంగా ఇళ్లు కోల్పోయి ఆపదలో ఉన్న కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు “వ్యాల్ల హరీష్ రెడ్డి” తన ఫౌండేషన్ ద్వారా బియ్యం వితరణ అందించారు.
లింగాపూర్ గ్రామానికి చెందిన పల్లే కైలాసం ముదిరాజు, గట్టు ఈశ్వరి కుటుంబాలకు, అలాగే భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయిన మాటూరి మల్లమ్మ, గారే సుమలత కుటుంబాలకు బియ్యాన్ని లింగాపూర్ మాజీ ఉపసర్పంచ్ నిమ్మరాజుల రవి,సాగర్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం, అవసరమైన సమయంలో వారికి తోడుగా ఉండటమే లక్ష్యంగా “వ్యాల్ల హరీష్ రెడ్డి ఫౌండేషన్” నిరంతరం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ నాయక్, మైనారిటీ నాయకులు ఎం.డి. అత్తరోద్దిన్, గుర్రం రాజలింగం, ఇరికిల్ల శ్రవణ్, బండ రాజు, రౌత్ గణేశ్, పిట్టల శంకర్, గట్టు కిషన్ తదితరులు పాల్గొన్నారు.

