Friday, August 14, 2026

Buy now

సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

* సంగారెడ్డి జిల్లాలో 1,500 మంది పోలీసులతో బందోబస్తు.. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సుమారు 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అలసత్వానికి తావులేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

అనంతరం అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఐపీఎస్తో కలిసి ఎలిప్యాడ్, కాన్వాయ్ మార్గం, పార్కింగ్ ప్రాంతాలు, గంజీ మైదాన్, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, హాస్టల్ గడ్డ, తారా కళాశాల, సీఎస్ఐ చర్చి, ఐబి చౌరస్తా తదితర ప్రాంతాలతో పాటు సభా స్థలమైన అంబేద్కర్ స్టేడియం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

సభా ప్రాంగణంలో ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, అత్యవసర సేవల నిర్వహణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

# సంగారెడ్డిలో ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు:

ముఖ్యమంత్రి సభకు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే బస్సులు, వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు.

* ఆందోల్ నియోజకవర్గం: సభకు వచ్చే బస్సులకు గంజీ మైదాన్‌లో పార్కింగ్.
* నారాయణఖేడ్, జిన్నారం, హత్నూర: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బస్సులకు పార్కింగ్.
* జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాలు: హాస్టల్ గడ్డ ఈద్గా వద్ద బస్సులకు పార్కింగ్.
* పటాన్‌చెరువు, ఇందిరేశం, ఈసనాపూర్: న్యూ బస్‌స్టాండ్‌లో బస్సులకు పార్కింగ్.
* నాలుగు చక్రాల వాహనాలు: మహబూబ్ సాగర్ చెరువు కట్ట, ప్రభుత్వ బాలికల పాఠశాలలో పార్కింగ్.
* ద్విచక్ర వాహనాలు: ప్రభుత్వ బాలుర పాఠశాలలో పార్కింగ్.
* మీడియా వాహనాలు: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పార్కింగ్.

సభకు వచ్చే బస్సులు, నాలుగు చక్రాల, ద్విచక్ర వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసు అధికారులు సూచించారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లతో సీఎం పర్యటనను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.

Related Articles

spot_img

Most Popular