Friday, August 14, 2026

Buy now

సుబేదారి ఆర్ట్స్ కాలేజీలో నూతన కాకతీయ క్యాంటీన్ ప్రారంభం

# విద్యార్థులు, సిబ్బందికి నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ: సుబేదారి ఆర్ట్స్ కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన కాకతీయ క్యాంటీన్‌ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా క్యాంటీన్ నిర్వాహకులు దూలం క్రాంతికుమార్ గౌడ్, సుదర్శన్‌లను ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తూ క్యాంటీన్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

క్యాంటీన్ అందుబాటులోకి రావడంతో కళాశాల విద్యార్థులు, సిబ్బందికి మెరుగైన ఆహార సదుపాయం అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్యాంటీన్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్వాహకులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి, లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. సుదర్శన్, పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ నిర్మల, నాన్-టీచింగ్ NGO అధ్యక్షుడు, సుబేదారి యూనిట్ రాజు నాయక్, ఆర్ట్స్ కాలేజ్ టీచింగ్ ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ డాక్టర్ భిక్షపతి, ఫ్యాకల్టీ సభ్యులు, నాన్-టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular