* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో తాగునీటి సమస్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి
* తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
* పెద్దపల్లి ఐడీఓసీలో తాగునీటి సమస్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
పెద్దపల్లి : జిల్లాలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా, సమస్యలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామం, ప్రతి వార్డులో తాగునీటికి సంబంధించిన సమస్యలను గుర్తించాలని సూచించారు. గ్రామాలు, వార్డుల వారీగా తాగునీటి సరఫరా పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు, అవసరమైన చర్యలకు సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు.
* తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి:
ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నీటి నాణ్యతలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలు, వార్డుల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ, తాగునీటికి సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ గంగాధర శ్రీనివాస్, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ పూర్ణచందర్,ఏఈ లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

