Friday, August 14, 2026

Buy now

పెద్దూరు హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో అదుపుతప్పిన కారు

# ధ్వంసమైన పెట్రోల్‌ పంపింగ్‌ మిషన్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరు సబ్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో కారు అదుపుతప్పి పెట్రోల్‌ పంపింగ్‌ మిషన్‌ను ఢీకొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పెట్రోల్‌ పంపింగ్‌ మిషన్‌ విరిగిపడింది.

పెట్రోల్‌ బంక్‌ పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కారును అక్కడ పనిచేసే వ్యక్తి పక్కకు జరిపేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి పంపింగ్‌ మిషన్‌ను ఢీకొట్టినట్లు తెలిసింది.

అదే సమయంలో పంపింగ్‌ మిషన్‌ వద్ద ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో బంక్‌ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

spot_img

Most Popular