Friday, August 14, 2026

Buy now

సంగారెడ్డిలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి

# లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

సంగారెడ్డి:సంగారెడ్డిలో శనివారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సీఎం బహిరంగ సభను సుమారు లక్ష మందితో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభ విజయవంతం కోసం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామిలతో ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

సంగారెడ్డి ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ ప్రధానమంత్రులు జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజీవ్‌గాంధీ విగ్రహాలను ఆవిష్కరించనున్నారని జగ్గారెడ్డి తెలిపారు. సీఎం సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచే సుమారు 50 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం అరకొరగా రేషన్‌ కార్డులు ఇచ్చిందని జగ్గారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టి రాష్ట్రవ్యాప్తంగా కోటి ఐదు లక్షల మందికి కార్డులు అందించనుందని తెలిపారు.

సభకు వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్‌ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్‌ కిషన్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జార్జ్‌, నాయకులు కిరణ్‌ గౌడ్‌, కూన సంతోష్‌, షఫీ హఫీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular