Sunday, September 6, 2026

Buy now

మెదక్ జిల్లా పోలీస్ అధికారుల సంఘానికి నూతన కార్యవర్గం

మెదక్: మెదక్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగాయి.

నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా అభిలాష్, ఉపాధ్యక్షులుగా ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సందీప్ రెడ్డి, ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శిగా ఆర్‌ఎస్‌ఐ నరేష్, కోశాధికారిగా విజయ్, సంయుక్త కార్యదర్శిగా రాము ఎన్నికయ్యారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ అభినందించారు.

పోలీస్ అధికారుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం సమర్థవంతంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు. పోలీస్ అధికారుల సమస్యల పరిష్కారంతో పాటు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

Related Articles

spot_img

Most Popular