* తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్
పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అనేక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థుల పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు కోలేటి సతీష్ ఆధ్వర్యంలో మండలంలోని రాగినేడు లోని మండల పరిషత్ ప్రజా పాఠశాలలో సుమారు రెండు లక్షల రూపాయల విలువైన సేవలందించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలలోని 20 మంది విద్యార్తినులకు సైకిళ్ళు అందించారు. ఇంతే కాకుండా పాఠశాలకు ప్రింటర్లు, కంప్యూటర్లు, స్కూల్ బ్యాగులు, స్పోర్ట్స్ యూనిఫారాలు, బల్లలు కుర్చీలు మొదలగు వాటిని అందజేశారు.
ఈ సందర్భంగా కోలేటి దామోదర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థుల ఉన్నతికి చేయూతనిస్తున్నటువంటి బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ ఆయన అభినందించారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కోలేటి శ్రీనివాస్ తో పాటు సంస్థ ఫౌండర్ సభ్యులు రంజిత్ కుమార్, రాగినేడు సర్పంచ్ సోమా కుమార్, ఉప సర్పంచ్ గుమ్మడి విజయ్ లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అధ్యాపకులు, విద్యార్థులతో పాటు కుర్మపల్లి, బ్రాహ్మణపల్లి సర్పంచులతోపాటు పలువురు పాల్గొన్నారు.

