Friday, September 4, 2026

Buy now

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు

* మడక, లాలపల్లి, ధూళికట్ట గ్రామాల్లో రూ.5 లక్షల నిధులతో నిర్మాణం

పెద్దపల్లి: ఓదెల మండలం మడక గ్రామంతో పాటు ఎలిగేడు మండలం లాలపల్లి, ధూళికట్ట గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన “ఇందిరమ్మ ఇళ్లను” బుధవారం రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆయా గ్రామాల్లో ఇళ్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణ వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

నూతన వధూవరులకు ఆశీర్వాదం

అనంతరం పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన వివాహ శుభకార్యాలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular