Friday, September 4, 2026

Buy now

రూ.50 లక్షలతో కంపోస్టింగ్ షెడ్ నిర్మాణానికి శ్రీకారం

* పారిశ్యుద్ధ కార్మికులను ప్రోత్సహించాలి
* కౌన్సిలర్లు అందరూ అభివృద్ధి వైపు దృష్టి సారించాలి
* ప్రజలకు అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాలి
* రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి : మున్సిపల్ కార్యాలయంలో రూ. 50 లక్షల నిధులతో పెద్దపల్లి మండలం రాఘవాపూర్ వద్ద నూతనంగా నిర్మించబోయే కంపోస్టింగ్ షెడ్ కు శంకుస్థాపన చేసి అనంతరం మున్సిపల్ పారిశ్యుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి వన మహోత్సవంలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మొక్కలను పంపిణీ చేశారు.

అనంతరం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు, పట్టణ కౌన్సిలర్లకు పెద్దపల్లి పట్టణ అభివృద్ధి పట్ల పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణానికి సంబందించి రాఘవపూర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా రూ.50 లక్షలతో డి.ఆర్.సి.సి & కంపోస్టింగ్ షెడ్ నిర్మాణం కోసం టెండర్లు పూర్తి చేసుకొని ఈరోజు సోమవారం రోజున నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అని అలాగే రాబోయే ఆరు మాసాల్లో అట్టి నిర్మాణాన్ని ప్రారంభించుకునేలా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచనలు చేయడం జరిగిందని తెలిపారు.

రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించి పేదల సొంతింటి కళను నెరవేర్చడానికి రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ ఇండ్లును మంజూరు చేస్తుందని ఆ పథకంలో బాగంగా పెద్దపల్లి పట్టణంలో రంగపల్లి శుభాష్ నగర్,లో నిర్మాణం పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించుకోవడం జరిగింది అని అన్నారు.

రానున్న రోజుల్లో రెండో విడుత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే అర్హులైన ఆర్పీలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పెద్దపల్లి పట్టణంలో ఇప్పటి వరకే చాలా అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నామని పట్టణ ప్రజల సహకారంతో జెండా చౌరస్తా నుండి మసీద్ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు పనులు చేయడం జరుగుతుందని దసరా వరకు రోడ్డు పనులు పూర్తి చేస్తామని అభివృద్ధి కోసం ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కౌన్సిలర్లు పూధర్ మహేందర్, అక్క పెళ్లి సుజాత క్రాంతి కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular