* మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మండల అధ్యక్షుల పేర్లు ప్రకటించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్
పెద్దపల్లి, సెప్టెంబర్ 3: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అనుమతితో పెద్దపల్లి జిల్లా పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల పేర్లను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.
పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు కీలకపాత్ర పోషించాలని రాజ్ ఠాకూర్ ఆకాంక్షించారు.
మంథని నియోజకవర్గం
మంథని — శ్రీ విల్ ప్రసాద్
ముత్తారం — శ్రీ దొడ్డ బాలరాజు
రామగిరి — శ్రీ తుమ్మసారం గౌడ్
కమాన్పూర్ — శ్రీ సయ్యద్ అన్వర్
పెద్దపల్లి నియోజకవర్గం
పెద్దపల్లి — శ్రీ కట్లూరి సుదాకర్ రెడ్డి
ఓదెల — శ్రీ మూల శ్రీనివాస రెడ్డి
కాల్వ శ్రీరాంపూర్ — శ్రీ గజవేన సదయ్య
సుల్తానాబాద్ — శ్రీ చిలుక సతీష్
ఎలిగేడు — శ్రీ సామ రాకేష్ రెడ్డి
జూలపల్లి — శ్రీ బొజ్జ శ్రీనివాస్
సుల్తానాబాద్ టౌన్ — శ్రీ వి. అభ్యుదయ గౌడ్
పెద్దపల్లి టౌన్ — శ్రీ భూతగడ్డ సంపత్
రామగుండం నియోజకవర్గం
అంతర్గాం — శ్రీ సింగం కిరణ్
పాలకుర్తి — శ్రీ ముక్కెర శ్రీనివాస్
ధర్మపురి నియోజకవర్గం
ధర్మారం — శ్రీ తాళ్లపల్లి రూపేష్ నాయక్
నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సూచించారు.

