Monday, September 21, 2026

Buy now

కాంగ్రెస్ పాలన పై డప్పులతో నిరసన

పెద్దపల్లి : విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలి. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఎర్రోళ్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ర్యాలీ‘చావు డప్పు’ నిరసన చేసి జిల్లా కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా నాయకులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

యువమోర్చా నాయకులు ఎర్రోళ్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ‘చావు డప్పు’ కొట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నప్పటికీ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యువమోర్చా నాయకులు పేర్కొన్నారు.

విద్యార్థుల చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, ఉన్నత విద్యపై ప్రభావం పడకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల హక్కుల కోసం యువమోర్చా నిరంతరం పోరాడుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ నిధులను విడుదల చేయాలి. లేకపోతే విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతాం” కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నాయకులను అడ్డుకుంటాం పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఇంటిని ముట్టడిస్తాం ఎమ్మెల్యే ప్రభుత్వం ఇస్తా అని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పట్టణ అధ్యక్షులు పెంజర్ల రాకేష్ సీనియర్ నాయకులు తంగడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్ రావు, మేకల శ్రీనివాస్, ఒల్లే తిరుపతి, ఈర్ల శంకర్, కావేటి రాజగోపాల్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఉప్పు కిరణ్ రాజమహంత, పట్టణ ప్రధాన కార్యదర్శులు గుడ్ల సతీష్ బోలవేన సురేందర్, గాదాసి సతీష్, బొడ్డుపల్లి కుమార్, సబ్బు మల్లయ్య, పడాల శ్రీనివాస్ గౌడ్ వీరేశం గౌడ్, గడ్డం అనిల్, సుంకనపల్లి ఆంజనేయులు, ఇంజపురి సోనీ, పెద్దపల్లి యువ మోర్చా నాయకులు కుశానపల్లి మధుకరన్, కుక్క అంజి,

పెద్దపల్లి మండల యువమోర్చా అధ్యక్షులు రెడ్ల వేణు, కాల్వ శ్రీరాంపూర్ మండల యువమోర్చా అధ్యక్షులు దిలీప్ ఓదెల యువమోర్చా నాయకులు శాతల్లా కుమార్, సిలారపు మహేష్ కలవెల్లి నవీన్, మంద దేవరాజ్, పంది సాయి కుమార్, నూతి విరాట్, తుడి అఖిల్, లక్ష్మణ్ అఖిల్, తిప్పని నరేశ్ భాకం రాజు పూరెల్ల అభి ఓర్పుల రాజేశ్, హరీష్, నరేశ్, కళ్యాణ్, గుమ్మడి నరేష్, మోధుంపల్లి కళ్యాణ్, శంబోజు కల్యాణ్, కుందేళ్ళ శ్రీనివాస్, సంఘం వంశీ, జెట్టి రాకేష్, అలవేని జశ్వంత్, సంగం అభిషేక్, పుల్ల పరుశురాం, జాజి రాకేష్, వినోద్, హరీష్, పవన్, సందీప్, సుశాంత్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular