Sunday, October 4, 2026

Buy now

“కాళోజి కలం.. ప్రజల గొంతుక!”

* అదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా ప్రజాకవి జయంతి వేడుకలు.. నివాళులర్పించిన ఎస్పీ అఖిల్ మహాజన్

అదిలాబాద్: తెలంగాణ భాష, సంస్కృతి, ప్రజా చైతన్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మ విభూషణ్ ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను అదిలాబాద్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ కాళోజి నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ మట్టి గొప్పతనాన్ని, ప్రజల ఆకాంక్షలను తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిన కాళోజి.. ప్రజల సమస్యలను తన కలంతో ప్రశ్నించిన చైతన్య స్వరం అని ఎస్పీ పేర్కొన్నారు.

ప్రజల హక్కులు, తెలంగాణ భాష, సంస్కృతి, సామాజిక చైతన్యం కోసం కాళోజి చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన రచనలు, ఆశయాలను స్మరించుకుంటూ ప్రజా చైతన్యానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.“కాళోజి కలం.. ప్రజల గొంతుక”గా నిలిచిందని పేర్కొంటూ, ఆయన ఆశయాలు, స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular