ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, అమరవీరురాలు చాకలి ఐలమ్మ పోరాటాలు అపారమైన స్పూర్తినిస్తాయని రజక సంఘం నాయకులు పేర్కొన్నారు. రేవెల్లి మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో రజక సంఘం అధ్యక్షుడు చిట్టిరాజుల మల్లేష్, కోశాధికారి బొందయ్య ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… నాడు దొరల, భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా, తన హక్కుల సాధన కోసం చాకలి ఐలమ్మ సాగించిన వీరోచిత పోరాటం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. బహుజనుల హక్కుల కోసం, మహిళా చైతన్యం కోసం ఆమె చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

