* జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల
పెద్దపల్లి : జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాల్లో ఈ నెల 12న న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. గురువారం జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మాట్లాడుతూ ఈ ఈ నెల 12న నిర్వహించనున్న లోక్ అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, భూ వివాదాలు, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, బ్యాంకు రికవరీ మరియు చెక్ బౌన్స్ కేసులతో పాటు కుటుంబ తగాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని సూచించారు.
లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన కేసులపై ఎలాంటి అప్పీల్ లేదా రివిజన్లకు అవకాశం ఉండదని, కేసు ఇక్కడితో పూర్తిగా క్లోజ్ అవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే అవసరం తప్పి మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. కేసు రాజీ పరిధిలోకి వస్తుందో లేదో తెలుసుకోవడానికి న్యాయసేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
అలాగే కోర్టు కేసుల్లో వాదించేందుకు ఆర్థిక స్తోమత లేని అర్హులైన పేదలకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరంజిల్లా అధనపు న్యామూర్తీ కుచం సునిత,న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనీజ కోహిర్కర్ తో కలిసి లోక్ అదాలత్ పోస్టర్ ఆవిష్కరించారు.

