Sunday, October 4, 2026

Buy now

చిన్న వెంకటాపురంలో గుండాల పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్

* విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, గొడుగుల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం/గుండాల: మండలంలోని చిన్న వెంకటాపురం మల్లెలవారిగుంపులో గుండాల పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, విద్యార్థులతో పోలీసులు మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, గొడుగులను పంపిణీ చేశారు. విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలకు పలు అంశాలపై పోలీసులు అవగాహన కల్పించి, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా పోలీసులు కోరారు.

Related Articles

spot_img

Most Popular