* వాహనాలను అడ్డుకుని ప్రయాణికుల నుంచి డబ్బులు డిమాండ్
ఆదిలాబాద్: రహదారిపై వాహనాలను అడ్డుకుని ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ట్రాన్స్జెండర్ను ఆదిలాబాద్ రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జామ్దాపూర్ ‘ఎక్స్’ రోడ్డు వద్ద వాహనాలను అడ్డుకుంటూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న మెహెక్ ఖాన్ @ సోను (26)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రహదారులపై వాహనాలను అడ్డుకోవడం, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతంగా డబ్బులు వసూలు చేయడం చట్టవిరుద్ధమని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
ప్రజల భద్రత, సౌకర్యం కోసం ఆదిలాబాద్ పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు.

