* ఆలయ విస్తరణ, బద్ది పోచమ్మ ఆలయం, 80 ఫీట్ల రోడ్డు పనుల పరిశీలన
* వివిధ శాఖల అధికారులతో ఐడీఓసీలో సమీక్ష
వేములవాడ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణం, 80 ఫీట్ల రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను సమన్వయంతో చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
అనంతరం ఐడీఓసీలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల పురోగతి, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణం, 80 ఫీట్ల రోడ్డు నిర్మాణంతో పాటు సంబంధిత అంశాలపై అధికారులతో చర్చించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి, నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

