* అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన సామర్థ్యంపై పరిశీలన
హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నాగోల్ మెట్రో స్టేషన్‌లో భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితులు లేదా భద్రతాపరమైన ముప్పు ఏర్పడినప్పుడు పోలీసులు, ఇతర భద్రతా విభాగాలు సమన్వయంతో వేగంగా స్పందించే సామర్థ్యాన్ని పరీక్షించడం మాక్ డ్రిల్ ఉద్దేశ్యంగా అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా స్టేషన్, పరిసర ప్రాంతాలను తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది అప్రమత్తత, అత్యవసర స్పందన సన్నద్ధతను సమీక్షించారు. కీలక రవాణా కేంద్రాల్లో భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

