Wednesday, September 16, 2026

Buy now

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన:ఎంపీ గడ్డం వంశీకృష్ణ

* గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన

ధర్మపురి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శంకుస్థాపన చేసిన ఆలయ అభివృద్ధి పనులను ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మపురికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఆలయాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular