Sunday, October 13, 2024

Buy now

illegal relationship: కన్నతల్లే కడతేర్చింది

  • వీడిన హత్య కేసు మిస్టరీ
  • అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకును చంపిన తల్లి
  • పటాన్‌చెరులో దారుణం

తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న కొడుకునే కడతేర్చిందో కసాయి తల్లి. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. స్వాతి అనే ఓ మహిళ భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అప్పటికే స్వాతికి విష్ణువర్ధన్‌ (10) కుమారుడు ఉన్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీన కుమారుడిని స్వాతి గొంతు నులిమి చంపింది. ఆ తర్వాత ప్రియుడు అనిల్‌తో కలిసి అదేరోజు రాత్రి ముత్తంగి ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన కుమారుడి మృతదేహం పడేసి వెళ్లింది.

ఆ మరునాడు బాలుడి మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు మృతదేహంపై గాయాలను గుర్తించి, శవ పరీక్ష కోసం ఆస్పత్రిని తరలించారు.

అప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంగారెడ్డిలోని అన్ని పోలీస్‌స్టేషన్లతో పాటు మూడు కమిషనరేట్లకు సమాచారం అందించారు.

ఈ క్రమంలోనే వారికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. వెంటనే మృతుడి తల్లి స్వాతితో పాటు ఆమె ప్రియుడు అనిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో కుమారుడి తానే గొంతు నులిమి హత్య చేసినట్లు స్వాతి పోలీసుల ముందు నిజం ఒప్పుకుంది. ఆమెకు సహకరించిన అనిల్‌ను సైతం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Related Articles

spot_img

Most Popular