Friday, November 8, 2024

Buy now

gang rape: గంజాయి బ్యాచ్‌ ప్రేమ పేరుతో గ్యాంగ్‌ రేప్‌

హైదరాబాద్ కాచిగూడ్‌ మైనర్‌ బాలిక గ్యాంగ్‌ రేప్‌ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నేరెడ్‌మెట్‌కు చెందిన యువకుడు విజయ్‌కుమార్‌ కాచిగూడకు చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు.

ఆ యువతి సదరు బాలిక ఇంటిపక్కనే ఉండడంతో బాలిక ఫోన్‌ నుంచి అప్పుడప్పుడు విజయ్‌కు ఫోన్‌ చేసేది. ఫోన్‌ నెంబర్‌ నెంబర్‌ను సేవ్‌ చేసుకున్న విజయ్‌ బాలికను ప్రేమ పేరుతో ట్రాప్‌ చేశాడు. అప్పడప్పుడు బైక్‌పై పలు ప్రాంతాల్లో తిప్పేవాడు.

2023లో తొలిసారి బాలికపై అత్యాచారం చేసిన విజయ్‌.. ఆ తర్వాత పలుమార్లు బాలికను లొంగదీసుకున్నాడు. బాలికను తన స్నేహితులకు పరిచయం చేశాడు.

బాలికను నేరెడ్‌మెట్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి విజయ్‌తో పాటు తన స్నేహితులు గ్యాంగ్‌ రేప్‌ (సామూహిక అత్యాచారం)కు పాల్పడ్డారు. ఇలా అవకాశం చిక్కినప్పుడల్లా బాలికను బెదిరిస్తూ తన లైంగిక వాంఛను తీర్చుకునేవారు.

ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో అసలు నిజం వెలుగుచూసింది. తల్లి బాలికను నిలదీయడంతో తనపై జరిగిన దారుణాన్ని చెప్పింది.

వెంటనే కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కేసును నేరెడ్‌మెట్‌ ఠాణాకు బదిలీ చేశారు. ఇదిలాఉంటే బాలికపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డ యువకులను పోలీసులు గంజాయి బ్యాచ్‌గా గుర్తించారు.

Related Articles

spot_img

Most Popular