Friday, August 14, 2026

Buy now

NH-44పై నిఘా మరింత పటిష్టం

తూప్రాన్‌: NH-44పై వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై నిఘాను మరింత పటిష్టం చేయాలని మల్టీ జోన్–I ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, IPS అధికారులను ఆదేశించారు. తూప్రాన్‌ టోల్‌గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా NH-44పై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ATMS) ద్వారా వాహనాల రాకపోకలు, అతివేగం, ట్రాఫిక్‌ ఉల్లంఘనలను 24/7 పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా అతివేగం, రాంగ్‌ లేన్‌, హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ ఉల్లంఘనలను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ తనిఖీలో మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, IPS, అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, IPSతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular