Tuesday, July 14, 2026

Buy now

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా:కోలేటి దామోదర్

* తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్
పెద్దపల్లి,ప్రతినిధి : ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. పెద్దపల్లి మండలం రాగినేడు గ్రామంలోని శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ పర్యవేక్షించారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దేవాలయానికి దత్తత దేవాలయంగా ఉన్నటువంటి శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి సన్నిధానంలో హైదరాబాదుకు చెందిన కాంట్రాక్టర్ పర్యవేక్షణలో నిర్మిస్తున్నటువంటి కాలభైరవ స్వామి, చండీశ్వరాలయము తో పాటు స్టోర్ రూమ్ వంటశాల నిర్మాణాలను పర్యవేక్షించి పలు సూచనలను చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోమ కుమార్, గుమ్మడి విజయ్, పడాల తిరుపతి, ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మలతో పాటు కోలేటి శ్రీనివాస్, బల్లు చంద్ర ప్రకాష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular