Friday, September 4, 2026

Buy now

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

* కట్టంగూర్‌లో స్మార్ట్ రేషన్‌ కార్డుల పంపిణీ

కట్టంగూర్: నకిరేకల్‌ నియోజకవర్గం కట్టంగూర్‌ మండల తహశీల్దార్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అధునాతన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు మరింత పారదర్శకంగా, సులభంగా అందే అవకాశం కలుగుతుందని తెలిపారు.అనంతరం లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular